ప్రధాని పదవికి రాహుల్, చంద్రబాబు, శరద్ పవార్.. ఉన్నారు!: మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

- ప్రధాని పదవికి చాలా మంది ఉన్నారు
- కేసీఆర్ తో కూడా మాట్లాడాను
- ఎన్నికలకు ముందే కూటమి కూర్పు
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వచ్చిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే పొత్తులపై పూర్తి అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని అన్నారు. ఒకవేళ కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో పరస్పరం వ్యతిరేకించుకున్నా, జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తామని అన్నారు. తాను కేసీఆర్ తో కూడా మాట్లాడానని, ఆయన కూడా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాను ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు అసత్య ప్రచారం జరుగుతోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.