USA: ఉగ్రవాదులపై పోరాటంలో మద్దతుగా నిలుస్తాం: భారత్ లో యూఎస్ రాయబారి జస్టర్

  • జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపిన జస్టర్
  • ప్రధాని మోదీకి ఫోన్ చేసిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ
  • ఉగ్ర దాడి ఘటనపై ఖండన

జమ్ముకశ్మీర్ లో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిని అమెరికా ఖండించింది. ఈ ఘటనపై భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ స్పందిస్తూ, ఉగ్రవాదులపై పోరాటంలో భారత్ కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ఈ దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ ఘటనపై నేపాల్ ఫ్రధాని కేపీ శర్మ ఓలి కూడా స్పందించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు చెప్పారు.

రేపు పుల్వామాకు ఎన్ఐఏ సభ్యుల బృందం

పన్నెండు మంది సభ్యులతో కూడిన ఎన్ఐఏ బ‌ృందం రేపు పుల్వామాకు వెళ్లనుంది. ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఘటనా స్థలానికి ఈ బృందం వెళ్లనుంది.

More Telugu News