Narendra Modi: జవాన్లపై దాడి హేయం.. వారి ఆత్మత్యాగం వృథా కాదు: మోదీ

  • పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని
  • మృతవీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా వుంటుంది 
  • రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడానన్న ప్రధాని 

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా వద్ద నేటి సాయంత్రం జరిగిన ఉగ్రదాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఈ దాడి హేయమైన చర్య అని మోదీ పేర్కొన్నారు. ఈ పిరికిపంద చర్యను ఖండిస్తున్నామని అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మత్యాగం వృథా కాబోదని, మృతవీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని మోదీ ట్విట్టర్ లో స్పందించారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడినట్టు ప్రధాని వెల్లడించారు. పుల్వామా ఘటనపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించినట్టు తన ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

More Telugu News