kangana ranaut: తన జీవిత కథను తానే తెరకెక్కిస్తున్న కంగన రనౌత్!

  • 'మణికర్ణిక' సక్సెస్ తో మరింత పేరు 
  • స్వీయ దర్శకత్వంలో కంగన బయోపిక్
  • కథను సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్

'మణికర్ణిక' చిత్రం భారీ హిట్ కావడంతో కంగన రనౌత్ పేరు మారుమోగుతోంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలో క్రిష్ తప్పుకోవడంతో... కంగనా స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ సంచలన ప్రకటన చేసింది. తన బయోపిక్ ను స్వయంగా తానే తెరకెక్కించబోతున్నానని ప్రకటించింది. ఇప్పటికే బయోపిక్ కు సంబంధించిన యూనిట్ ను కూడా కంగన సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. 'బాహుబలి', 'మణికర్ణిక' చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ బయోపిక్ కు కథను రెడీ చేస్తున్నట్టు సమాచారం. 'మణికర్ణిక'కు పని చేసిన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు కూడా పని చేయనుంది.

కంగనకు ప్రచారం చేసేలా ఈ చిత్రం ఉండదని...  ఆమె జీవితంలో అనేక ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తామని కంగన టీమ్ తెలిపింది. కంగన జీవితంలో ఆమెను ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారని... ఈ వ్యక్తులను కూడా చిత్రంలో చూపిస్తామని వెల్లడించింది.

More Telugu News