ak47: 7.47 లక్షల ఏకే47 తుపాకులను తయారు చేయనున్న ఇండియా

  • భారత సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం
  • భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, రష్యన్ కలాష్నికోవ్ కన్సర్న్ జాయింట్ వెంచర్
  • ఒప్పందం కుదిరిన వెంటనే భారత్ కు అందనున్న 50 వేల ఏకే47లు

భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7.47 లక్షల ఏకే47 తుపాకులను తయారు చేసే ప్రపోజల్ కు ఆమోదముద్ర వేసింది. భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, రష్యన్ కలాష్నికోవ్ కన్సర్న్ లు జాయింట్ వెంచర్ గా ఏర్పడి వీటిని తయారు చేయనున్నాయి. దీనికి సంబంధించిన ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నెలకొల్పే అవకాశం ఉన్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం దీనికి సంబంధించిన ప్రపోజల్ కు కేంద్రం ఆమోదముద్ర వేసినట్టు ఏఎన్ఐ తెలిపింది.

అమెరికాకు చెందిన ఓ సంస్థతో 72,400 అస్సాల్డ్ రైఫిల్స్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రోజుల వ్యవధిలోనే... కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వారం చివరకల్లా దీనికి సంబంధించిన ఒప్పందంపై భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, రష్యన్ కలాష్నికోవ్ కన్సర్న్ లు సంతకాలు చేసే అవకాశం ఉంది. డీల్ కుదిరిన వెంటనే దాదాపు 50 వేల ఏకే47 తుపాకులు భారత్ కు అందనున్నాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏకే47 తుపాకులను ఇండియాలో తయారు చేయనున్నారు.

More Telugu News