arya: వచ్చేనెలలోనే ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి

  • తమిళనాట ఆర్యకి మంచి ఇమేజ్
  •  గ్లామర్ తో మెప్పించిన సాయేషా సైగల్
  •  పెళ్లికి ఇరు కుటుంబాల అంగీకారం  

తమిళనాట ఆర్యకి మంచి క్రేజ్ వుంది .. విలక్షమైన పాత్రలను చేస్తూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలుగు .. హిందీ భాషల్లో తను చేసిన సినిమాలు కలిసి రాకపోవడంతో, సాయేషా సైగల్ తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. అక్కడ మంచి అవకాశాలతో పాటు సక్సెస్ ను కూడా అందుకుంది. గ్లామరస్ నాయికగా మంచి మార్కులు కొట్టేసింది.

ఈ క్రమంలోనే ఆమె ఆర్య ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త కొన్ని రోజులుగా కోలీవుడ్లో షికారు చేస్తోంది. ఈ వార్తలో నిజం ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల వాళ్లు అంగీకరించారట. వచ్చేనెలలో వీరి వివాహాన్ని జరిపించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే వాళ్లంతా బిజీగా వున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News