Karnataka: మాజీ లవర్ ఫొటోను తగలబెడితే.. ఫ్రీగా ‘ఫుడ్ ఐటమ్’ అందిస్తాం!: బెంగళూరు కేఫ్ ఆఫర్

  • వాలెంటైన్స్ డే ఆఫర్ 
  • బెంగళూరులోని రౌండప్ కేఫ్ ప్రకటన
  • మండిపడుతున్న నెటిజన్లు

హోటల్స్, రెస్టారెంట్లు పబ్లిసిటీ కోసం రకరకాల ఆఫర్లు పెడుతుంటాయి. మరికొన్ని అయితే ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తుంటాయి. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యువతీయువకులకు విచిత్రమైన ఆఫర్ ఇచ్చింది. ‘మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి ఫొటోను తగలబెడితే భోజనం అనంతరం ఫ్రీగా డెస్సర్ట్ (స్వీట్ లేదా ఐస్ క్రీమ్)ను అందిస్తాం’ అని ప్రకటించింది.

బెంగళూరుకు చెందిన రౌండప్ కేఫ్ ఈ ఆఫర్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఐడియా నిజంగా బాగుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, ప్రేమికుల దినోత్సవం రోజున ఇలాంటి పిచ్చిపనులు ఏంటని మరికొందరు మండిపడుతున్నారు.

More Telugu News