surya: ఆసక్తిని రేపుతోన్న సూర్య 'ఎన్జీకే' తెలుగు టీజర్

  • సెల్వరాఘవన్ నుంచి 'ఎన్జీకే'
  • విభిన్నమైన పాత్రలో సూర్య 
  • నాయికలుగా రకుల్ .. సాయిపల్లవి

సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' (నంద గోపాల కృష్ణ ) రూపొందుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ .. సాయిపల్లవి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ .. తెలుగు టీజర్లను రిలీజ్ చేశారు. సూర్య పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

సూర్య పాత్రకి సంబంధించి పూర్తి భిన్నమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేయడం వలన సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రకుల్ కి .. సాయిపల్లవికి ఇక్కడ మంచి క్రేజ్ ఉండటం ఈ సినిమాకి మరింత కలిసొచ్చే అంశం. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో సూర్య వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే ఆశతో వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

More Telugu News