vijay devarakonda: బుల్లితెరపైకి విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'

  • బుల్లితెరపైకి వచ్చిన 'గీత గోవిందం'
  • అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రంగా రికార్డ్
  • ఈ నెల 17న 'టాక్సీవాలా' ప్రసారం     

విజయ్ దేవరకొండకి క్రితం ఏడాది 'గీతగోవిందం' .. 'టాక్సీవాలా' సినిమాలు ఘన విజయాలను అందించాయి. ఈ రెండు సినిమాలు కూడా విజయ్ దేవరకొండ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి .. ఆయనను స్టార్ హీరోగా మార్చేశాయి.

అలాంటి ఈ సినిమాలలో ఆల్రెడీ 'గీత గోవిందం' బుల్లితెరపై ప్రసారమై 20.8 రేటింగ్ తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమాలకి సంబంధించి ఇది అత్యధిక రేటింగ్ అని చెబుతున్నారు. ఇక 'టాక్సీవాలా' సినిమాను జీ తెలుగువారు ఈ నెల 17వ తేదీన (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'గీత గోవిందం' రేటింగ్ ను అధిగమిస్తుందా .. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. 

More Telugu News