Windies: ఇంగ్లండ్ కెప్టెన్ రూట్‌ను ‘గే’ అన్న ఫలితం.. విండీస్ ఆటగాడు గాబ్రియెల్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం

  • సెయింట్ లూసియా టెస్టులో గాబ్రియెల్ అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన ఐసీసీ
  • మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత.. మూడు డీమెరిట్ పాయింట్లు

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ‘గే’ అని దూషించిన విండీస్ పేసర్ షనాన్ గాబ్రియెల్‌పై ఐసీసీ కొరడా ఝళిపించింది. ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు వన్డేలు ఆడకుండా గాబ్రియెల్‌ను సస్పెండ్ చేసింది. కాగా, గత 24 నెలల్లో గాబ్రియెల్ 8 డీమెరిట్ పాయింట్లు తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. తాజాగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను మరోమారు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గాబ్రియెల్ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోతతోపాటు మూడు డీమెరిట్ పాయింట్లు అందుకోనున్నాడు.  

సెయింట్ లూసియా టెస్టులో ఇంగ్లిష్ కెప్టెన్ జో రూట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో ‘గే’ అని అర్థం వచ్చేలా దూషించాడు. స్పందించిన రూట్.. ఇతరులను దూషించడానికి ‘గే’ అనే పదాన్ని వాడొద్దని, ‘గే’ గా ఉండడం తప్పుకాదని పేర్కొని హీరోగా మారాడు.

More Telugu News