naveen: నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్న యంగ్ హీరో

  • 'అడ్డా' దర్శకుడి నుంచి మరో మూవీ
  • పైరసీ నేపథ్యంలో సాగే కథ
  • మార్చిలో ప్రేక్షకుల ముందుకు

యువ కథానాయకుడు నవీన్ చంద్ర తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఇంతవరకూ ఆయనకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'హీరో .. హీరోయిన్' అనేది ఈ సినిమా టైటిల్ కాగా .. 'ఏ పైరెటెెడ్ లవ్ స్టోరీ' అనేది క్యాప్షన్. రెండు పాటల మినహా మిగతా షూటింగ్ పార్టు పూర్తిచేసుకున్న ఈ సినిమాను, మార్చిలో విడుదల చేయనున్నారు.    

ఈ సినిమాలో నవీన్ చంద్ర సరసన గాయత్రి సురేశ్ .. పూజా జవేరి కనిపించనున్నారు. సినిమా పైరసీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాను గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడుకుని ఉంటుంది. ఓ నిర్మాత కూతురికి .. పైరసీ చేసే నాకు మధ్య ప్రేమకథ నడుస్తూ ఉంటుంది. నా తొలి సినిమా పైరసీ జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. పైరసీ చేయడమంటే నిర్మాత సొమ్మును దోచుకోవడమే. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా రూపొందుతోన్న ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది" అని చెప్పాడు. 

More Telugu News