Amanchi Krishnamohan: పార్టీ మారిన వెంటనే విమర్శలు చేయటం తగదు: ఆమంచిపై శిద్దా రాఘవరావు ఫైర్

  • పార్టీ వీడినందు వల్ల ఇబ్బందేమీ లేదు
  • చంద్రబాబే స్వయంగా హామీ ఇచ్చారు
  • పార్టీ ఎందుకు మారారో అర్థం కావట్లేదు

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడినందువల్ల టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమంచి ఎందుకు పార్టీని వీడారో తెలియదన్నారు. తమ పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చామని కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

చంద్రబాబే స్వయంగా నేనున్నాను అని హామీ ఇచ్చినా కూడా ఆమంచి పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారిన వెంటనే విమర్శలు చేయడం బాధ్యతా రాహిత్యమని మండిపడ్డారు. చీరాలలో కరణం బలరాం పోటీ చేస్తారా? లేదంటే వేరే వాళ్లు పోటీ చేస్తారా? అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. పసుపు కుంకుమ కార్యక్రమంపై విమర్శలు, డ్వాక్రా సంఘాలను ఆదుకోవడం గురించి ఆమంచి తెలుసుకోవాలని శిద్దా రాఘవరావు సూచించారు.

More Telugu News