nayana: రిలీజ్ కి రెడీ అవుతోన్న నయనతార మూవీ

  • తమిళంలో 'ఇమైక్కా నోడిగళ్'
  • తెలుగులో 'అంజలి సిబిఐ'
  • తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  

నయనతారకి క్రితం ఏడాది విజయాలను అందించిన తమిళ చిత్రాల జాబితాలో 'ఇమైక్కా నోడిగళ్' ఒకటి. నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో అధర్వ .. రాశిఖన్నా యువ జంటగా నటించారు. ఇక అనురాగ్ కశ్యప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషించారు. అప్పట్లోనే ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు.

ఇప్పుడు ఈ సినిమాను 'అంజలి సిబిఐ' అనే టైటిల్ తో ఈ నెల 22వ తేదీన విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఇక విడుదలకి సంబంధించిన ఏర్పాట్లు వేగాన్ని పుంజుకున్నాయి. ఈ సినిమా ఇక్కడ కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.

More Telugu News