Jayaram: ఏసీపీ, సీఐ సూచనలతోనే జయరాంది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించా: రాకేష్ రెడ్డి

  • జయరాంది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు
  • చంపాలన్న ఉద్దేశం లేదు
  • కొట్టడం వల్లే జయరాం మృతి

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక విషయాలను ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి వెల్లడించాడు. మూడు రోజుల కోర్టు కస్టడీలో భాగంగా నేడు రాకేష్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. జయరాంది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదని.. అసలు తనకు జయరాంను చంపాలన్న ఉద్దేశమే లేదని స్పష్టం చేశాడు.

జనవరి 31న జయరాం బాడీని కారులో వేసుకుని హైదరాబాద్‌లో తిరిగానని.. విచారణలో వెల్లడించాడు. డబ్బు కోసమే అమ్మాయిల పేరుతో ట్రాప్ చేసి ఇంటికి పిలిపించానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న జయరాం.. తాను కొట్టిన దెబ్బలకు మృతి చెందారని తెలిపాడు. హత్య చేసిన రోజు సీఐ శ్రీనివాస్‌కు 13 సార్లు ఫోన్ చేశానని.. అదే రోజు ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని.. వారి సూచనలతోనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నానని పోలీసులకు తెలిపాడు.

More Telugu News