gujjar: పోరాడి సాధించిన గుజ్జర్లు.. రిజర్వేషన్ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదం

  • రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న గుజ్జర్లు
  • గుజ్జర్లతో పాటు మరో నాలుగు కులాలకు 5 శాతం రిజర్వేషన్
  • సవరణ బిల్లును ఆమోదించిన రాజస్థాన్ అసెంబ్లీ

తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రాజస్థాన్ లోని గుజ్జర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా కూడా మారాయి. గత ఆరు రోజుల నుంచి కూడా వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. గుజ్జర్లతో పాటు మరో నాలుగు కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లుకు రాజస్థాన్ అసెంబ్లీ నేడు ఆమోదముద్ర వేసింది. రాజస్థాన్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు-2019ను ఈరోజు సభలో ప్రవేశపెట్టింది. ఈ సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.

ఆరోజు ఆమోదించిన బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ ను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచారు. ఈ ఐదు శాతం రిజర్వేషన్ ను గుజ్జర్లతో పాటు గడియా లోహార్, బంజారా, గడరియా, రైకస్ కులాలకు వర్తింపజేస్తారు. ఈ ఐదు కులాలు చాలా వెనుకబడి ఉన్నాయని... వీరికి 5 శాతం రిజర్వేషన్లు అనివార్యమని బిల్లులో పేర్కొన్నారు.

More Telugu News