Andhra Pradesh: పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ చెల్లించకపోతే ఉద్యమిస్తాం.. ఆమరణ దీక్షకు దిగుతాం: ఏపీ జూడాల హెచ్చరిక

  • నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్
  • రుయాలో అధికారులు, జూడాల మధ్య చర్చలు విఫలం
  • జూడాల తీరును తప్పుబట్టిన అధికారులు

నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న తమ స్టైఫండ్ చెల్లించాలని కోరుతూ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూడాలకు, అధికారులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల స్టైఫండ్ చెల్లించేందుకు అధికారులు నిరాకరించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా మీడియాతో జూడాలు మాట్లాడుతూ, దీక్షల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు సర్కార్, పెండింగ్ లో ఉన్న తమ స్టైఫండ్ చెల్లించేందుకు ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. దీక్ష కోసం వినియోగించే ధనంలో పది శాతం తమకు కేటాయిస్తే సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. తమ సమస్య పరిష్కారం కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. కాగా, జూడాల తీరును అధికారులు తప్పుబట్టారు.

More Telugu News