annapurna: హీరోయిన్స్ అంటే అలా ఉండాలి.. అందుకే నేను సరిపోననుకున్నాను: సీనియర్ నటి అన్నపూర్ణ

  • హీరోయిన్ గా పరిచయమయ్యాను
  • అలాంటి లక్షణాలు నాకు లేవనిపించింది
  •  జంధ్యాల గారి నాటకంలో తల్లిపాత్ర చేశాను     

తెలుగు తెరపై తల్లి పాత్రల్లో మెప్పిస్తూ వందలాది సినిమాలు చేసిన అతికొద్ది మంది నటీమణులలో అన్నపూర్ణ ఒకరు. హీరోకైనా .. హీరోయిన్ కైనా తల్లిగా తెరపై కనిపిస్తూ, పాత్రలో ఆమె ఒదిగిపోయే తీరు ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని కల్పించింది. అలాంటి అన్నపూర్ణ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పుకొచ్చారు.

'స్వర్గం - నరకం' సినిమాలో కథానాయికగా పరిచయమయ్యాను. హీరోయిన్ అంటే పెద్ద కళ్లు ఉండాలి .. మాటతీరు ఆకర్షణీయంగా ఉండాలి .. నడకలో ఒయ్యారం ఉండాలి .. డాన్స్ లో ప్రత్యేకత ఉండాలని నాకు అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రంభ .. ఊర్వశి .. మేనకల మాదిరిగా ఉండాలి. అందుకే హీరోయిన్ గా నేను సరిపోను అని నాకు అనిపించింది. అదే సమయంలో జంధ్యాల గారి ఒక నాటకంలో తల్లిపాత్ర వేశాను. ఈ తరహా పాత్రలను చేస్తే బాగుంటుందని అనుకున్నాను .. ఆ దిశగానే ప్రయాణాన్ని కొనసాగించాను" అని అన్నారు.

More Telugu News