Telugudesam: చంద్రబాబు స్వయంగా చెప్పినా వినని టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి... రాజీనామా లేఖ సమర్పణ!

  • తెలుగుదేశం పార్టీకి గుడ్ బై
  • కార్యకర్తలతో సమావేశం తరువాత నిర్ణయం
  • త్వరలోనే వైసీపీలో చేరిక

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఉదయం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పంపారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించానని అన్నారు. నేడు వైసీపీ అధినేత జగన్ తో సమావేశం కానున్నానని అన్నారు.

కాగా, ఇటీవల ఆమంచిని బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమంచిని కలిసిన ప్రకాశం జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు, పార్టీని వీడవద్దని నచ్చజెప్పి, ఆపై సీఎం వద్దకు తీసుకెళ్లారు. మారిన చీరాల రాజకీయ పరిస్థితుల్లో ఆమంచికి మరో మంచి అవకాశం ఇస్తామని చంద్రబాబు సర్దిచెప్పినా ఆయన వినకపోవడం గమనార్హం. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి అనూహ్య రీతిలో విజయం సాధించి, ఆపై తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

More Telugu News