vaishnav: మెగా మేనల్లుడి మూవీలో విలన్ గా తమిళ స్టార్ హీరో

  • దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
  • హీరోగా వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమా
  • ప్రత్యేక ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం   

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జాలరిగా కనిపించనున్నాడు. జాలరుల జీవితం నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ .. సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ తరహా పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే సరిగ్గా సరిపోతాడనే ఉద్దేశంతో ఆయనను తీసుకున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News