Telangana: సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన తెలంగాణ రైతు సంఘం

  • వ్యవసాయ, రైతుల సమస్యలపై విజ్ఞప్తి
  • తేమ 8-12 శాతం ఉన్న పత్తిని సీసీఐకు పంపాలి
  • నాణ్యత తనిఖీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి

తెలంగాణలోని పత్తి రైతులకు మద్దతు ధర అమలు చేయాలని, బోనస్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ కు తెలంగాణ రైతు సంఘం ఓ లేఖ రాసింది. ఈ లేఖ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తేమ 8 నుంచి 12 శాతం ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పంపాలని, ఈ కేంద్రాల్లో నాణ్యత తనిఖీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, దళారులు, వర్తకుల నియంత్రణ లేక నష్టపోతున్న మిరప రైతులను ఆదుకోవాలని కోరారు. క్వింటాల్ మిరప రూ.10 వేలతో మార్క్ ఫెడ్ వంటి సంస్థలచే కొనుగోలు చేయించాలని, మిరప కాలనీలుగా గుర్తించి పంట ఉత్పత్తి, శుద్ధి, అమ్మకాలకు ఏర్పాటు చేయాలని, ముదిగొండ తరహాలో ఇతర ప్రాంతాల్లో మిరప పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కేసీఆర్ ను కోరారు.

More Telugu News