paruchuri gopalakrishna: ఎన్టీఆర్ కి, కృష్ణకి మధ్యగల తేడాను గురించి చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

  • రామారావుగారు మాపై బాధ్యత పెట్టేవారు
  • కృష్ణగారు తనపై భారం వేసుకునేవారు
  • ఆయన జడ్జిమెంట్ ఎలా వుంటుందో అర్థమైంది    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, సినిమాల పరంగా ఎన్టీఆర్ .. కృష్ణకి మధ్యగల తేడాను గురించి ప్రస్తావించారు. "రామారావుగారు 'మేజర్ చంద్రకాంత్' సినిమా సమయంలో మాట్లాడుతూ .. "రాఘవేంద్రరావు గారు దర్శకుడు .. మోహన్ బాబు గారు నిర్మాత .. పరుచూరి బ్రదర్స్ రచయితలు .. ఇక నేను వినేదేముంది కథ .. కానివ్వండి" అన్నారు.

'అదేంటి అన్నగారు అలా అంటారు' అంటే, 'బరువు నాపై పెట్టుకుంటే సినిమాపోతే నేను బాధ్యుడిని అవుతాను. బరువు మీపై పెడితే మీరే బాధ్యులు అవుతారు' అన్నారు. అలా ఆయన మాపై బరువు పెట్టేసరికి భయం వేసేది. ఇక కృష్ణగారి విషయానికి వచ్చేసరికి .. ఇది కావాలి అని ఆయన ఎంత నిక్కచ్చిగా చెప్పేవారో .. ఇది వద్దు అనే విషయాన్ని కూడా ఆయన అంతే నిక్కచ్చిగా చెప్పేవారు. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే విషయం అర్థమయ్యాక, ఆయన వద్దన్నవి మానేశాము .. చేద్దామంటే చేసేశాము' అని అన్నారు. 

More Telugu News