వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్‌కు బీజేపీ ఎంపీ హరిబాబు ఘాటు జవాబు

Tue, Feb 12, 2019, 07:43 AM
  • టీడీపీ నేతలున్న విమానంలో హరిబాబు
  • టీడీపీ-బీజేపీ అనైతిక బంధానికి ఇది నిదర్శనమన్న విజయసాయి
  • విమానంలో ఎవరైనా ప్రయాణించవచ్చన్న బీజేపీ ఎంపీ
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన టీడీపీ నేతలతోపాటు బీజేపీ ఎంపీ హరిబాబు ఉండడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి దుమ్మెత్తి పోశారు. టీడీపీ-బీజేపీలు బయటకి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ లోలోపల మాత్రం ప్రేమాయణం సాగిస్తున్నాయనడానికి ఈ ఫొటో నిదర్శనమంటూ ట్వీట్ చేశారు. వీరి అనైతిక బంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీతో కటీఫ్ అంటూ, బాబు అండ్ కో ఆ పార్టీతో చాటుమాటు కాపురం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
 
విజయసాయి రెడ్డి ట్వీట్‌పై హరిబాబు స్పందించారు. విమానంలో ఏ పార్టీవారైనా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. విశాఖ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వచ్చానన్న ఆయన సహ ప్రయాణికులు ఎవరన్న విషయం తనకు అనవసరమన్నారు. విమానంలో ఏ పార్టీకి చెందినవారైనా ప్రయాణించవచ్చని, ఈ విషయంలో ఎటువంటి నిషేధం లేదని విజయసాయిరెడ్డికి చురక అంటించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement