Andhra Pradesh: నేడు రథ సప్తమి.. అరసవిల్లిలో ప్రారంభమైన వేడుకలు

  • రాత్రి నుంచే మొదలైన పూజలు
  • స్వామి వారికి పాలాభిషేకం
  • స్వామి దర్శనం కోసం భక్తుల బారులు

రథసప్తమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళధ్వనులతో సూర్యనారాయణస్వామికి మహాక్షీరాభిషేకం చేశారు. ఉదయం ఆరు గంటల వరకు స్వామి వారి మూల విరాట్‌కు పాలాభిషేకం నిర్వహించారు.

రథసప్తమి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి  భక్తులతో జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని క్యూలలో బారులు తీరారు.

More Telugu News