Andhra Pradesh: ముగిసిన ధర్మపోరాట దీక్ష.. చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన మాజీ ప్రధాని దేవెగౌడ!

  • 12 గంటల పాటు ధర్మపోరాట దీక్ష
  • రాహుల్, మన్మోహన్ సహా పలువురు హాజరు
  • జైహింద్ అంటూ కార్యక్రమాన్ని ముగించిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చేపట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ ముగిసింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

దాదాపు 12 గంటల పాటు సాగిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రేపు ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు బయలుదేరుతామని తెలిపారు. ఈ దీక్ష సందర్భంగా తమ వల్ల తప్పు ఏదైనా జరిగిఉంటే క్షమించాలని జాతీయ నేతలను కోరారు. నేతలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలు, సభికులకు సూచించారు. అనంతరం జైహింద్ అంటూ కార్యక్రమాన్ని ముగించారు. కాగా, ఢిల్లీలోని రెండు ప్రత్యేక రైళ్లు ఈరోజు రాత్రి 11.30 గంటలకు శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు బయలుదేరుతాయని టీడీపీ వర్గాలు తెలిపాయి.

More Telugu News