West Bengal: ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువే ముఖ్యం.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!

  • మమత ప్రభుత్వ ఉత్తర్వులకు సమర్థన
  • ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలుంటాయని వ్యాఖ్య
  • లౌడ్ స్పీకర్లపై సుప్రీంలో బీజేపీ పిటిషన్

బీజేపీ నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం 2013లో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలన్న బీజేపీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని అభిప్రాయపడింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పిల్లలకు పరీక్షలు ఉంటాయన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి లౌడ్ స్పీకర్లకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

More Telugu News