ap7am logo

నీ గొంతులోని పవర్ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు కూడా వినిపిస్తుంది!: బొమ్మాళి రవిశంకర్ పై వర్మ ప్రశంసలు

Mon, Feb 11, 2019, 03:15 PM
  • ఈ నెల 14న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్
  • ఓ పాట క్లిప్ ను రిలీజ్ చేసిన వర్మ
  • పాటను ఆలపించిన రవిశంకర్
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ-వ్యక్తిగత జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ను ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో  ‘దోపిడిదారుల పెత్తనమే ఇక వద్దని చిత్తుగా పడగొడతా’ అంటూ హైవోల్టేజీతో సాగే పాట క్లిప్ ను ఈరోజు వర్మ విడుదల చేశారు.

ప్రముఖ నటుడు సాయికుమార్ సోదరుడు, ఢమరుకం సినిమాలో విలన్ గా నటించిన బొమ్మాళి రవిశంకర్ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ..‘రవిశంకర్.. నీ గొంతులోని పవర్ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు కూడా వినిపిస్తుంది’ అని ప్రశంసించారు. ఈ పాటను సిరాశ్రీ రాయగా, కల్యాణీమాలిక్ సంగీతం అందించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
GarudaVega Banner Ad