Tamilnadu: నటి సంధ్య హత్య కేసులో కొత్త కోణం.. స్నేహితుడి స్ర్కీన్ ప్లే ఆధారంగా భార్యను చంపేసిన బాలకృష్ణన్‌!

  • ఈ ఘటన స్ఫూర్తిగా థ్రిల్లర్ సినిమాకు ప్లాన్
  • కాదల్ ఇలవశం సినిమా ఫ్లాప్ తో నష్టాలు
  • మీడియాతో మాట్లాడిన పోలీస్ అధికారి

తమిళ నటి సంధ్యను ఆమె భర్త, దర్శకుడు బాలకృష్ణన్‌ ఇటీవల కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఏడు చోట్ల పడేయడానికి ఓ స్నేహితుడే కారణమని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

సదరు స్నేహితుడు చెప్పిన స్క్రీన్ ప్లేలో ఇలాంటి ఓ సీన్ ఉందనీ, దాని ఆధారంగానే బాలకృష్ణన్‌ ఈ దారుణానికి తెగబడ్డారని వ్యాఖ్యానించారు. ఇటీవల బాలకృష్ణన్‌ తెరకెక్కించిన ‘కాదల్ ఇలవశం’ సినిమా పరాజయం పొందడంతో ఆయన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అంతేకాకుండా ఈ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఓ థ్రిల్లర్ సినిమాను తీసేందుకు బాలకృష్ణన్‌ సిద్ధమయ్యాడని పేర్కొన్నారు.

More Telugu News