NTR: 'మహానాయకుడు'లో బుల్లి ఎన్టీఆర్ గా దేవాన్ష్... షూటింగ్ పూర్తి!

  • త్వరలో విడుదలకు సిద్ధమైన మహానాయకుడు
  • చిన్న ఎన్టీఆర్ గా నటించిన దేవాన్ష్
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం

ఎన్టీ రామారావు బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్ నటించాడని తెలుస్తోంది. దేవాన్ష్ సీన్ల చిత్రీకరణ పూర్తయిపోయిందని, కెమెరా ముందు దేవాన్ష్ భయపడలేదని చిత్ర వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్యా రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి విదితమే. ఈ సినిమా అనుకున్నంత భారీ కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో, రెండో భాగాన్ని మరింత జాగ్రత్తలు తీసుకుని తీర్చిదిద్దేపనిలో ఉన్నాడు క్రిష్.

More Telugu News