Narendra Modi: నరేంద్ర మోదీ ఎటాక్ పై చంద్రబాబు కౌంటర్ ఎటాక్ ఇలా!

  • చంద్రబాబు టార్గెట్ గా మోదీ విమర్శలు
  • ప్రతి విమర్శపైనా స్పందించిన చంద్రబాబు
  • వ్యక్తిగత ఆరోపణలనూ చేసుకున్న మోదీ, బాబు

నిన్న గుంటూరు సమీపంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన చంద్రబాబు కౌంటర్ ఎటాక్ కూడా చేశారు. నరేంద్ర మోదీ చేసిన ఏ విమర్శపై చంద్రబాబు ఎలా స్పందించారంటే...

నరేంద్ర మోదీ: నేను వస్తున్నప్పుడు దారి పొడవునా మోడీ గో బ్యాక్ అన్న నినాదాలతో పోస్టులు కనిపించాయి. నేను కచ్చితంగా మళ్లీ వెనక్కు వెళతాను. ప్రధానిగా న్యూఢిల్లీకి వెళతాను.
చంద్రబాబు: గో బ్యాక్ అంటే మోదీకి అర్థం తెలియదనుకుంటా. మిమ్మల్ని ఢిల్లీలో చూడాలని కాదు... తిరిగి గుజరాత్ కు వెళ్లాలని.

నరేంద్ర మోదీ: కాంగ్రెస్ విముక్త రాష్ట్రం కావాలంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్ తో జత కట్టారు. దీన్ని చూసిన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.
చంద్రబాబు: నాడు కాంగ్రెస్ దురహంకారంతో వ్యవహరించడంతో ఎదుర్కొనేందుకు పోరాడాం. ఇప్పుడు అదే దురహంకారాన్ని బీజేపీ చూపిస్తోంది. అందుకే నేటి పోరాటం.

నరేంద్ర మోదీ: సన్ (సూర్యుడు) రైజ్ స్టేట్ గా ఏపీని మారుస్తానంటూ మీ సన్ (కుమారుడు)ను రైజ్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబు: మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. ఆత్మీయతలు, అనుబంధాలు తెలియవు.

నరేంద్ర మోదీ: కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటే వెనకడుగు ఎందుకు. గతంలోనూ ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేదు.
చంద్రబాబు: రాజధాని అమరావతి నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చారు. ఏమిచ్చారని మీకు లెక్కలు చెప్పాలి?

నరేంద్ర మోదీ: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సీనియర్.
చంద్రబాబు: వెన్నుపోటులో సీనియర్ మీరే. అద్వానీకే వెన్నుపోటు పొడిచారు. గోద్రా అల్లర్ల సమయంలో మిమ్మల్ని సీఎం పదవి నుంచి తొలగించాలని అందరూ అంటుంటే, అద్వానీయే అడ్డుకున్న విషయాన్ని మరిచారు. అటువంటి వ్యక్తికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు.

నరేంద్ర మోదీ: పార్టీలు మార్చడంలో చంద్రబాబు దిట్ట. ఓడిపోవడంలోనూ ఆయన ప్రముఖుడే. తనకన్నా సీనియర్ అని చెప్పుకుంటారు. అంతకుమించి చెప్పడానికి ఇంకేమీ లేదు.
చంద్రబాబు: నేనెన్నడూ పార్టీలు మారలేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే కొనసాగుతున్నా. ఎన్నడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదు.

More Telugu News