Naga Jhansi: ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు తేల్చిందిదే!

  • సూర్యతేజకు ప్రత్యక్షంగా సంబంధం లేదు
  • ప్రేరేపించిన పరిస్థితుల వెనుక సూర్యతేజ
  • కేసు నమోదు చేయనున్నామన్న పోలీసులు

టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు తమ విచారణను ఓ కొలిక్కి తెచ్చారు. ఝాన్సీ మరణం వెనుక ఆమె ప్రియుడు సూర్యతేజకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన పరిస్థితుల వెనుక అతను ఉన్నాడని, న్యాయ నిపుణుల సలహా, సూచనల మేరకు అతనిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. మధు అనే యువతి ద్వారా సూర్యతేజకు ఝాన్సీ పరిచయమైందని, వారిద్దరూ ప్రేమలో పడ్డారని, ఆపై నటించడం ఆపేయాలని అతను ఒత్తిడి తెచ్చినా, ఝాన్సీ ఆ పని చేయలేదని పోలీసులు తెలిపారు.

దీంతో ఆమెతో గొడవపడిన సూర్యతేజ, మొబైల్‌ నంబర్‌ ను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టాడు. ఆపై ఝాన్సీ ఫోన్ చేసినా దానికి అతను స్పందించలేదు. ఆత్మహత్యకు రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఝాన్సీ ఫోన్ ట్రై చేసింది. వాట్స్ యాప్ మెసేజ్ లు పెట్టింది. అయితే, సూర్యతేజ మొబైల్ నెట్ ఆఫ్ లో ఉండటంతో అవి డెలివరీ కాలేదు. నెట్ ఆన్ చేసుకునే సమయానికి ఝాన్సీ వాటిని డిలీట్ చేసింది.

 వారిద్దరి మొబైల్ ఫోన్లను పూర్తిగా పరిశీలించామని, సూర్యతేజను విచారించామని వెల్లడించిన పోలీసులు, ప్రియుడు అనుమానిస్తుండటం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడం, సూర్యతేజకు వేరే సంబంధాలు చూస్తుండటం తదితర కారణాలతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు.

More Telugu News