Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కీర్తి సురేశ్ సినిమా షూటింగ్ వాయిదా
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన చైతూ 
  • 25 నుంచి నితిన్ 'భీష్మ' షూటింగ్

*  'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేశ్ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 14న ప్రారంభం కావలసి వుంది. అయితే, అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడినట్టు తాజా సమాచారం. మహేశ్ కోనేరు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, కేరళలో జరుగుతుంది.
*  ప్రస్తుతం 'మజిలీ', 'వెంకీమామ' చిత్రాలలో నటిస్తున్న అక్కినేని నాగ చైతన్య త్వరలో 'ఎక్స్ ప్రెస్ రాజా' ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.
*  నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందే 'భీష్మ' చిత్రం షూటింగ్ ఈ నెల 25న హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

More Telugu News