ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు

10-02-2019 Sun 17:43
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ
  • సూర్యతేజ సెల్‌ఫోన్ స్వాధీనం
  • వాట్సాప్ సంభాషణల ఆధారంగా విచారణ

గత మంగళవారం హైదరాబాదు, అమీర్‌పేటలోని తన నివాసంలో బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నేడు ఝాన్సీ ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని... అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇద్దరి వాట్సాప్ సంభాషణల ఆధారంగా పోలీసులు సూర్యతేజను విచారిస్తున్నారు. ఇప్పటికే ఝాన్సీ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో నాని మీదున్న ప్రేమను ఝాన్సీ వ్యక్తం చేసినట్టు తెలిసింది.