t20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. చరిత్ర సృష్టిస్తుందా?

  • ఈ మ్యాచ్ గెలిస్తే కివీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన తొలి దేశంగా ఘనత
  • ఇప్పటికే 1-1తో సిరీస్ ను సమం చేసిన భారత్
  • ఇరు జట్లలో ఒక్కో మార్పు

హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 1-1తో సిరీస్ ను సమం చేసిన భారత్... ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకోవడమే కాకుండా, న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ ను గెలిచిన తొలి దేశంగా అవతరిస్తుంది.

మరోవైపు ఇరు జట్లలోనూ ఒక మార్పు జరిగింది. టీమిండియాలో చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. కివీస్ జట్టులో ఫెర్య్గూసన్ స్థానంలో బ్లెయిర్ టిక్నర్ జట్టులోకి వచ్చాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.

న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, టేలర్, మిచెల్, నీషమ్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, సౌథీ, సోధీ, బ్లెయిర్ టిక్నర్.

More Telugu News