Rains: నేడు వర్షం కురిసే అవకాశం.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచన!

  • తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
  • ఉపరితల ద్రోణి ప్రభావమే
  • తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. మాల్దీవుల నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు చాన్స్ ఉందని వారు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాత్రి పూట ఉష్ణోగ్రతలు సగటు కన్నా తగ్గాయని అన్నారు. కాగా, గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లో 18 నుంచి 20 డిగ్రీల వరకూ ఉన్న రాత్రిపూట ఉష్ణోగ్రత, గత రాత్రి 15 డిగ్రీలకు పడిపోయింది. చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేయడంతో, రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

More Telugu News