CBI: మమత ప్రతీకార చర్య.. సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు

  • కోల్‌కతా సీపీపై విచారణకు సిద్ధమవుతున్న సీబీఐ
  • సీబీఐకి ఝలక్కిచ్చిన మమత బెనర్జీ
  • ఆస్తులపై విస్తృత సోదాలు

చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో విచారణ కోసం వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకుని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన మమత బెనర్జీ ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆస్తులపై శుక్రవారం కోల్‌కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆస్తుల పరిశీలనకు మాత్రమే వచ్చామని  పోలీసులు చెబుతున్నప్పటికీ ఇందులో ‘రివేంజ్’ ఉందని తెలుస్తోంది.

కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ విచారించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రతీకార చర్యగానే భావిస్తున్నారు. మరోవైపు, నాగేశ్వరరావు ఆస్తుల విషయంలో సోదాలు నిర్వహించిన రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సోదాల్లో నాగేశ్వరరావు భార్య, కుమార్తె ఆధ్వర్యంలో నడిచే కంపెనీతోపాటు స్టాల్‌లేక్‌లో నాగేశ్వరరావు భార్య సారథ్యంలో నడుస్తున్న ఓ కంపెనీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News