Andhra Pradesh: ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలు

  • ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి  
  • ఔట్ సోర్సింగ్ సిబ్బందికి హెల్త్ కార్డులు
  • అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై చర్చ

ఈరోజు సాయంత్రం నిర్వహించిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. అనంతరం, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, విజయనగరం వర్శిటీకి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు చెప్పారు.

 అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై, బాధితుల సమస్య పరిష్కారంపై, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేతపై, ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు గంటా చెప్పారు.

More Telugu News