Ambati Rambabu: 40 లక్షల ఓట్ల తొలగింపుపై.. 15 రోజుల్లో ఈసీ విచారణ: అంబటి రాంబాబు

  • ఓట్ల తొలగింపుపై సరిగ్గా విచారణ జరగట్లేదు
  • ఒత్తిళ్లకు తలొగ్గకుంటే సహకరిస్తాం
  • సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి

ఓట్ల తొలగింపు అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని.. 15 రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి అంబటి రాంబాబు, బీజేపీ నేత గరిమెళ్ల చిట్టిబాబు, సీపీఎం నేత వైవీ, సీపీఐ నుంచి జల్లి విల్సన్ హాజరయ్యారు.

ఈ సమావేశానంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. 40 లక్షల ఓట్ల తొలగింపుపై ఈసీతో మాట్లాడామని.. 15 రోజుల్లో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసినట్టు తెలిపారు. సీపీఎం నేత వైవీ మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపు అంశంపై సరిగ్గా విచారణ జరగట్లేదని.. గ్రాడ్యుయేట్ ఓట్ల తొలగింపులో కూడా అవకతవకలున్నాయన్నారు. అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేస్తే ఈసీకి తాము సహకరిస్తామన్నారు. అనంతరం జల్లి విల్సన్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని.. పనులు లేక వలస వెళుతున్న గ్రామీణుల ఓట్లను తొలగించకుండా చూడాలని ఈసీని కోరినట్టు తెలిపారు.

More Telugu News