sensex: టాటా మోటార్స్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

  • రూ. 26,960 కోట్ల నెట్ లాస్ ను ప్రకటించిన టాటా మోటార్స్
  • 424 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 125 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా ఆటో స్టాకులు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ. 26,960.8 కోట్ల నెట్ లాస్ ను టాటా మోటార్స్ ప్రకటించడంతో... ఈ సంస్థ ఏకంగా 17.28 శాతం పతనమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 424 పాయింట్లు పతనమై 36,546కు పడిపోయింది. నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 10,943కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్, వేదాంత, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ కంపెనీలు టాప్ లూజర్స్ గా ఉన్నాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

More Telugu News