Yuvraj Singh: టీడీపీది ఎన్నికల కోసం చేసే ఆరాటమే తప్ప ధర్మపోరాటం కాదు: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

  • ఢిల్లీ దీక్షకు జనాలను తరలించాలని  టార్గెట్ లు పెట్టారు
  • దీక్ష కోసం రూ.10 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు   
  • హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతోంది వైసీపీనే

ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ టీడీపీ చేస్తున్న ధర్మపోరాటంపై వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కోసం చేసే ఆరాటమే తప్ప ఇది ధర్మపోరాటం కాదని అన్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలని నాలుగేళ్ల 9 నెలల తర్వాత బాబుకు తెలిసిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ దీక్షకు జనాలను తరలించాలని అధికారులకు టార్గెట్ లు పెట్టారని, హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతోంది వైసీపీనే అని గుర్తుచేశారు.

హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అని, హోదా కోసం పోరాడిన వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల కోసం యూటర్న్ తీసుకుని ధర్మాపోరాట దీక్షలు చేస్తున్నారని, ఢిల్లీలో దీక్ష కోసం రూ.10 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్న చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పరిధిలో ఉండే అంశాలపై చంద్రబాబే నిర్ణయం తీసుకుంటున్నారని, కాపులను బీసీల్లో చేరుస్తామని గతంలోనూ, కేంద్రం ప్రకటించిన ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారని విమర్శించారు. ఇప్పుడు కాపులు బీసీల్లో ఉన్నారా? ఓసీల్లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు.

More Telugu News