devegowda: లోక్ సభలో తీవ్ర ఉద్వేగానికి గురైన దేవెగౌడ

  • లోక్ సభలో నిన్న ఉద్వేగభరిత సన్నివేశం
  • సభలో ఇదే నా చివరి ప్రసంగం అంటూ ఉద్వేగానికి గురైన దేవెగౌడ
  • 57 ఏళ్లు ప్రజల కోసమే జీవించానన్న మాజీ ప్రధాని

లోక్ సభలో నిన్న మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభలో ఇదే తన చివరి ప్రసంగం అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో 57 ఏళ్లు ప్రజల కోసం జీవించానని చెప్పారు. ప్రధాని పదవిని చేపట్టాలనే కోరిక లేకపోయినప్పటికీ... అప్పటి ప్రముఖ నేతలు వీపీ సింగ్, జ్యోతిబసులు నిరాకరించడంతో తన పేరు తెరపైకి వచ్చిందని తెలిపారు.

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన సమయంలో... దేశంలోని నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రభుత్వ పథకాలకు వినియోగించాలన్న ప్రతిపాదన తన హయాంలో చేసిందేనని దేవెగౌడ చెప్పారు. మహాకూటముల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలు గందరగోళం సృష్టిస్తాయని, దానికి దేవెగౌడ ప్రభుత్వమే నిదర్శనమని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీల కూటములపై అనవసర వ్యాఖ్యలు వద్దని సూచించారు. వాజ్ పేయితోనే సంకీర్ణ ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. పార్టీల మధ్య అవగాహన ఉంటే... సంకీర్ణ ప్రభుత్వాలు విజయవంతమవుతాయని చెప్పారు.

More Telugu News