sarada kubhakonam: కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ కు సీబీఐ నోటీసులు... రేపు విచారణకు రావాలని ఆదేశం

  • కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ బృందం సూచన
  • మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారణ
  • 10న తృణమూల్‌ ఎంపీ కునాల్‌ ఘోష్‌ విచారణ

శారదా కుంభకోణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు సీబీఐ నోటీసులు పంపింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారణ జరగనుంది, ఈ విచారణకు శనివారం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

రాజీవ్‌ను విచారించేందుకు ఇటీవల కోల్‌కతా వెళ్లిన సీబీఐ బృందాన్ని అక్కడి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం రచ్చగా మారింది. తమ అధికారులపై పెత్తనం చలాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. చివరికి విషయం సుప్రీం కోర్టుకి వెళ్లడంతో, రాజీవ్‌ విచారణకు హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడం, షిల్లాంగ్ లో విచారణ నిర్వహించాలని పేర్కొనడం తెలిసిందే. 

More Telugu News