karthi: ఒక రోజు ముందుగానే 'దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • 'దేవ్'గా రానున్న కార్తీ
  • రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్
  •  14న సినిమా రిలీజ్

కథాకథనాలతో పాటు .. తన పాత్ర విషయంలో కార్తీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అలా ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి 'దేవ్' సినిమా చేశాడు. 'ఖాకీ'లో కార్తీ జోడీగా మెప్పించిన రకుల్, ఈ సినిమాలోను ఆయన సరసన అలరించనుంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 14వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10వ తేదీన, హైదరాబాద్ - అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఒక రోజు ముందుగానే ఈ వేడుకని నిర్వహించనున్నారు. వేదిక విషయంలోను .. సమయం విషయంలోను ఎలాంటి మార్పు లేదు. 9వ తేదీన ఈ వేడుకను జరపనున్నట్టుగా తాజాగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ తెచ్చిపెడుతుందని కార్తీ భావిస్తున్నాడు.

More Telugu News