BJP: బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోంది.. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు!: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
  • బీజేపీ ప్రలోభాల ఆడియో టేపులు విడుదల
  • బెంగళూరులో కన్నడ సీఎం మీడియా సమావేశం

కర్ణాటక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కనిపించడం లేదని మండిపడ్డారు. ఓవైపు సత్యాలు వల్లెవేస్తున్న మోదీ మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. బెంగళూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ బీజేపీ నేతలు చేసిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ను మీడియా ముందు ప్రదర్శించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలు అన్నింటిని సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానని సవాలు విసిరారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆశచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని కుమారస్వామి అన్నారు.

More Telugu News