Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. వ్యవసాయ రుణాల పరిమితి పెంపు!

  • హామీ లేని వ్యవసాయ రుణాల పరిమితి పెంపు నిర్ణయం
  • రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంపు
  • ఈ మేరకు త్వరలో అన్ని బ్యాంకులకు నోటీసులు

రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఎటువంటి హామీ లేకుండా రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షల వరకు పెంచింది. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ ఈరోజు ప్రకటించింది.

ఈ సమీక్ష నిర్ణయాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాల దృష్ట్యా ఎటువంటి హామీ లేకుండా రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్టు నిర్ణయించింది. ఈమేరకు త్వరలోనే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ నోటీసులు జారీ కానున్నాయి. కాగా, హామీ లేకుండా రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని 2010లో లక్ష రూపాయల వరకు పెంచింది.  

More Telugu News