Donald Trump: వారం రోజుల్లో సిరియాలో ఐసిస్ పూర్తిగా అంతమవుతుంది: డొనాల్డ్ ట్రంప్

  • ఇప్పటికే సిరియాలో ఐసిస్ ను భారీ ఎత్తున దెబ్బతీశాం
  • మిగిలిన స్థావరాలను కూడా ఐసిస్ కోల్పోనుంది
  • ఐసిస్ ను పూర్తగా అంతమొందించామనే వార్తను వారం రోజుల్లో ప్రకటిస్తాం

మరో వారం రోజుల్లో సిరియాలో ఉగ్ర సంస్థ ఐసిస్ పూర్తిగా కనుమరుగవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే ఆ దేశంలో ఐసిస్ ను భారీ ఎత్తున దెబ్బతీశామని... మిగిలిన స్థావరాలను కూడా వారం రోజుల్లో ఐసిస్ కోల్పోనుందని చెప్పారు. వాషింగ్టన్ లో జరిగిన ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు 70కి పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

సిరియా, ఇరాక్ లలో యూఎస్ మిలిటరీ, తమ భాగస్వాములు, సిరియన్ డెమోక్రాటిక్ బలగాలు కలసి ఐసిస్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. వారం రోజుల్లో సిరియాలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందించామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే విధానానికి అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పారు.

More Telugu News