G group: జీగ్రూపు సంస్థ కీలక నిర్ణయం... 'డీఎన్‌ఏ' ఆంగ్ల పత్రిక ఢిల్లీ ఎడిషన్ మూసివేత

  • ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం
  • 2012 నుంచి ఎస్సెల్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో పత్రిక ప్రచురణ
  • బ్యూరో మాత్రం కొనసాగుతుందని వెల్లడి

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న జీగ్రూప్‌ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  జీ గ్రూప్‌నకు చెందిన ఎస్సెల్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న డీఎన్‌ఏ ఆంగ్ల పత్రిక ఢిల్లీ ఎడిషన్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2005లో ఎస్సెల్‌, భాస్కర్‌ గ్రూపు సంయుక్తంగా ఈ పత్రికను ప్రారంభించాయి.

 2012లో భాస్కర్‌ గ్రూప్‌ పత్రిక నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంతో అప్పటి నుంచి ఎస్సెల్‌ గ్రూప్‌ దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. అయితే చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులతో పత్రిక నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో తమ గ్రూప్‌ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న ఆంగ్ల పత్రిక డీఎన్‌ఏ ఢిల్లీ ఎడిషన్‌ మూసివేయాలని నిర్ణయించింది. కేవలం ముంబయి ఎడిషన్‌పై మాత్రమే దృష్టిసారించి మిగిలిన వాటిని మూసివేస్తున్నామని, బ్యూరో మాత్రం కొనసాగుతుందని గ్రూప్‌ ప్రతినిధులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ వార్తా కథనంలో వెల్లడించింది. డెలిగెంట్‌ మీడియా కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో  డీఎన్‌ఏ పత్రిక ఒక భాగం.

More Telugu News