vishal: 'అయోగ్య' టీజర్ తో అదరగొట్టేస్తోన్న విశాల్

  • విశాల్ హీరోగా 'అయోగ్య'
  • తెలుగు 'టెంపర్'కి రీమేక్
  •  నాయికగా రాశి ఖన్నా  

విశాల్ కథానాయకుడిగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో 'అయోగ్య' రూపొందుతోంది. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇక కీలకమైన పాత్రలో పార్తీబన్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ దృశ్యాలకి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.

విశాల్ పాత్రను చాలా స్టైలీష్ గా డిజైన్ చేసినట్టుగా టీజర్ ను బట్టి తెలుస్తోంది. తెలుగులో పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్. ఎన్టీఆర్ ను ఈ సినిమాలో పూరి కొత్త కోణంలో చూపించాడు. తమిళంలో విశాల్ విషయంలో వెంకట్ మోహన్ కూడా అదే పద్ధతిని అనుసరించినట్టుగా అనిపిస్తోంది. సాధారణంగా విశాల్ సినిమాలు తెలుగులోను విడుదలవుతుంటాయి. అయితే 'అయోగ్య' తెలుగు సినిమా రీమేక్ కావడం వలన, ఇక్కడ ఆయన ఈ సినిమాను రిలీజ్ చేయడంలేదు.
 

More Telugu News