Cow welfare: గో సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్.. కేంద్ర కేబినెట్ ఆమోదం

  • ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’కు కేబినెట్ ఆమోదం
  • రూ. 750 కోట్ల కేటాయింపు
    చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం

గో సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటి సంరక్షణ, అభివృద్ది కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పథకాన్ని ప్రకటించింది. గోవులను పెంచడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆదాయం పెంచేందుకు ఈ కమిషన్ కృషి చేయనుంది.

కేంద్ర కేబినెట్‌ బుధవారం రాత్రి ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’కు ఆమోదం తెలిపింది. 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్టు న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్  తెలిపారు. పశుసంవర్థక శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదంటే యానిమల్స్ సైన్సెస్‌తోపాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఇతర సంస్థలతో ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌‌’ కలిసి పని చేయనుందని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News