కోల్ కతా సీపీని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న సీబీఐ బృందం

06-02-2019 Wed 21:46
  • ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు
  • తథాగత బర్దన్ నేతృత్వంలో పనిచేయనున్న బృందం
  • ఏ తేదీన ప్రశ్నిస్తారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది
శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసుల విషయమై కోల్ కతా పోలీస్ కమిషనర్ (సీపీ) రాజీవ్ కుమార్ ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది. సీబీఐలో డీఎస్పీ ర్యాంకు అధికారి అయిన తథాగత బర్దన్ ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. అయితే, ఏ తేదీన రాజీవ్ కుమార్ ని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా, ఈ నెల 8న తాను అందుబాటులో ఉంటానని రాజీవ్ కుమార్ ఇప్పటికే సీబీఐకు లేఖ ద్వారా తెలిపారు.