Pakistan: పాక్ లోని హిందూ దేవాలయం కూల్చివేతపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం.. కఠిన చర్యలకు ఆదేశాలు

  • సింథ్ ప్రావిన్స్ లోని ఖైరాపూర్ జిల్లాలో ఘటన
  • హిందూ ఆలయాన్ని కూల్చేసిన దుండగులు
  • విచారణకు సింథ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఇమ్రాన్

పాకిస్థాన్ లోని ఓ హిందూ దేవాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సింథ్ ప్రావిన్స్ లోని ఖైరాపూర్ జిల్లా కుంభ్ అనే ప్రాంతంలోని హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులకు అక్కడి హిందూ సమాజం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ సలహాదారు రాజేశ్ కుమార్ హర్దసనీ మాట్లాడుతూ, పాక్ లోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మతసామరస్యానికి భంగం కలిగించే యత్నాల్లో భాగంగానే గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

నిందితులపై కఠిన చర్యలు చేపట్టండి: ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు

హిందూ ఆలయ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ ప్రారంభించాలని సింథ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి చర్యలు తమ పవిత్ర గ్రంథం ఖురాన్ కు వ్యతిరేకమని, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

More Telugu News